: మేమందరమూ చంద్రబాబు ముఠాకు చెందిన వాళ్లమే: ప్రత్తిపాటి
ఎమ్మెల్యేలందరికీ తానంటే గౌరవమని, అదేవిధంగా తానూ గౌరవిస్తానని, వాళ్లందరూ తనకు సమానమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాలుగు సార్లు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశానని, ఎవరూ వేలెత్తి చూపకుండా పనిచేశానని చెప్పారు. ‘పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీధర్, వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు మీరంతా ఒక ముఠాగా ఉంటారంటారు.., అదేవిధంగా ఆలపాటి రాజా, ఆనంద్ వాళ్లదొక ముఠా అంటారు. ఇది నిజమేనా?’ అంటూ ఒక టీవీ ఛానెల్ ఇంటర్యూలో ప్రశ్నించగా దానికి పుల్లారావు సమాధానమిస్తూ, ఇక్కడ ఎటువంటి ముఠాలు లేవని, తామందరం చంద్రబాబునాయుడి ముఠానేనని, తమ నాయకుడు చంద్రబాబు అని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నామని ప్రత్తిపాటి అన్నారు.