: కష్టించి పనిచేయడం నా నైజం: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కష్టించి పనిచేయడమనేది మొదటి నుంచి తనకున్న నైజమని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, ఏరోజూ విరామం తీసుకోలేదని, కష్టించి పనిచేయడమే కాకుండా, ఏదైనా ఒకటి అనుకుంటే పట్టుదలగా దానిని పూర్తి చేసే వరకు ఊరుకోనని అన్నారు. తాను వ్యాపారాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా అదే పద్ధతిలో ముందుకు వెళుతున్నానని, ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా, చెడ్డపేరు తెచ్చుకోకుండా, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన, తాపత్రయంతోటే పని చేస్తున్నానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం తనకు లభిస్తూనే ఉందన్నారు.