: నాటి ‘క్షణక్షణం’ లొకేషన్ ఫొటో ఇది: దర్శకుడు రాంగోపాల్ వర్మ
సుమారు 25 ఏళ్ల క్రితం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘క్షణక్షణం’ చిత్రం అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. హీరో వెంకటేష్, అందాల తార శ్రీదేవి, బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్ లో తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ చిత్రం లొకేషన్ లో తాను, శ్రీదేవి, వెంకటేష్ అంటూ వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.