: ఆ విభాగాల్లో ఎక్కువ వయసున్న ఆటగాళ్లు ఆడటం సబబేనా?: ఢిల్లీ హైకోర్టు


అండర్ -17, అండర్ -19 విభాగాల్లో అంతకంటే ఎక్కువ వయసున్న క్రీడాకారులు భారత్ తరపున ఆడటం ఎంతవరకు సబబు? అంటూ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బీఏఐ)ను ఢిల్లీ హైకోర్టు వివరణ కోరింది. ఇటీవల కేరళలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో అండర్ -17, అండర్ -19 బాలురు, బాలికల విభాగాల్లో అంతకు మించిన వయసున్న క్రీడాకారులు ఉన్నారన్న ఆరోపణలపై ఈ నెల 19 లోగా వివరణ ఇవ్వాలని బీఏఐను ఆదేశించింది. కాగా, 15 ఏళ్ల తన కుమారుడిని 19 ఏళ్లకు పైగా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు ఓడించడంతో ట్రయల్స్ దశలోనే తన కొడుకు ఇంటిముఖం పట్టాల్సి వచ్చిందంటూ బాధిత క్రీడాకారుడి తండ్రి ఇస్సార్ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొందరు గేమ్స్ ఆడుతున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News