: ప్రధాని నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ స్వామి
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని చినజీయర్ స్వామి, చింతల రామచంద్రారెడ్డి, రామేశ్వరరావు కలిశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో నిర్మించనున్న సమతా మూర్తి విగ్రహ ప్రాముఖ్యతపై మోదీకి వీరు వివరించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ, ఆగస్టు 19వ తేదీన సమతా స్నానం కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.