: నగరికి క్యూ కట్టిన వైకాపా నేతలు!


వైకాపా నేతలు చిత్తూరు జిల్లా నగరికి క్యూ కట్టారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో నిర్వహించాలని భావించిన నేపథ్యంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల, నారాయణ స్వామి, సునీల్, దేశాయి తిప్పారెడ్డి తదితరులు ఇప్పటికే నగరిలో మకాం వేశారు. వీరి సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుండగా, ఏర్పాట్లను పార్టీ ఎమ్మెల్యే రోజా రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 'గడప గడపకూ వైకాపా' సాగుతున్న తీరు, చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి వ్యతిరేక విధానాలపై వీరు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News