: ముక్కోటి దేవతలు వచ్చే వేళ నదీ సంగమంతో మరింత మేలు: జయేంద్ర సరస్వతి


కృష్ణా నదికి పుష్కరాలు రావడం రాష్ట్రానికి మేలును కలిగిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పుష్కర ప్రాశస్త్యం గురించి వివరించారు. పుష్కర సమయాన మూడు కోట్ల మంది దేవతలు నదిలో స్నానమాచరిస్తారని, ఆ సమయంలో గోదావరి, కృష్ణా నదుల సంగమ ప్రాంతం మరింత పవిత్రతను సంతరించుకుంటుందని వివరించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ కు శుభాలను తెస్తుందని తెలిపారు. పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ స్నానం చేయాలని సూచించారు. పుష్కర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుష్కరాలు జరిగే 12 రోజులూ మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి జయేంద్ర సరస్వతి సూచించారు.

  • Loading...

More Telugu News