: ప్రజల భావోద్వేగాలే బుర్హాన్ ను అమరవీరుడిని చేశాయంటున్న పాక్


హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా ప్రకటించి, 19వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించడం వెనుక ప్రజల నుంచి వచ్చిన భావోద్వేగాల ఒత్తిడి ఉందని, పాక్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి రియాజ్ హుస్సేన్ ఖోఖర్ వ్యాఖ్యానించారు. వానీ ఎన్ కౌంటర్ అనంతరం తాము పెద్దగా స్పందించలేదని, అయితే, ప్రజలు, మీడియా నుంచి వచ్చిన ఒత్తిడితో, కల్పించుకోవాల్సి వచ్చిందని అన్నారు. "పరిస్థితులను చేదాటి పోనీకుండా చూడాల్సి వుంది. అయితే, అది భారత్ ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే ఆధారపడివుంది. కాశ్మీర్ లోయలో పరిస్థితిని మేము అనుకూలంగా మార్చుకోవాలని చూడటం లేదు. జరుగుతున్న ఘటనలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలన్నదే మా అభిమతం. మావైపున్న ప్రతి కాశ్మీరీ బుర్హాన్ ను అమరవీరుడిగానే భావిస్తున్నారు" అని అన్నారు. కాగా, బుర్హాన్ కాల్చివేత తరువాత, జరుగుతున్న అల్లర్లు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తుండగా, పలు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది.

  • Loading...

More Telugu News