: ప్రాణం తీసిన ఒకటో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ


ఇద్దరు ఒకటో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒక ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని టోలీ చౌక్ లో ఉన్న ప్రామిసింగ్ స్కాలర్స్ హై స్కూల్ లో నాలుగు రోజుల క్రితం ఇబ్రహీం (7), ఫయాజ్ (8) అనే ఒకటవ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఫయాజ్ అనే విద్యార్ధి ఇబ్రహీంను తీవ్రంగా కొట్టాడు. రాయితో కొట్టడంతో ఇబ్రహీం తీవ్రంగా గాయపడ్డాడు. బాధతో విలవిల్లాడుతున్న ఇబ్రహీంను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ నేడు మృత్యువాతపడ్డాడు. దీంతో టోలీచౌక్ ప్రాంతంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News