: అమెరికా విమానాశ్రయాధికారులను బెంబేలెత్తించిన బుల్లి విమానం


ప్రపంచ దేశాలపై ఐఎస్ఐఎస్ పంజా విసురుతుండడానికి తోడు లాడెన్ కొడుకు చేసిన హెచ్చరికలు అగ్రదేశం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన డెంటన్ నగరంలో విమానాశ్రయాధికారులను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని డెంటన్ నగరంలో ఎయిర్‌ పోర్టు‌లో ఓ బుల్లి విమానం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నేరుగా ల్యాండ్ అయిపోయింది. దీంతో కంగుతిన్న ఎయిర్‌ పోర్టు బలగాలు ఆ విమానాన్ని చుట్టుముట్టాయి. అయితే సాంకేతిక లోపంతోనే విమానం ల్యాండ్ అయ్యిందని నిర్ధారణ కావడంతో విమానాశ్రయాధికారులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News