: ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ను కట్టి తీరుతామన్న హరీశ్ రావు


మెదక్ జిల్లాలో నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టి తీరతామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మెదక్- అక్కన్నపేట రైల్వే లైను పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే భూములివ్వొద్దంటూ రైతులకు విపక్షాలు చెబుతున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆగదని కూడా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News