: శభాష్.. శిశువు అపహరణ కేసును ఛేదించిన విజయవాడ డీసీపీని భుజంతట్టి ప్రశంసించిన కామినేని
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువు అపహరణ కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించారని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కామినేని.. నిందితులని పట్టుకున్న పోలీసులని అభినందించారు. విజయవాడ డీసీపీ శ్రీనివాస్ సహా గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులని మీడియా ముందు భుజం తట్టి ఆయన ప్రశంసించారు. శిశువుని అపహరించిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు.