: 11వ అంతర్రాష్ట్ర మండలి భేటీ ప్రారంభం!... మెజారిటీ ముఖ్యమంత్రులు హాజరు!
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాల్లో కీలక విభాగంగా పరిగణిస్తున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసంతో మొదలైన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాల్లో కీలకమైన ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులూ హాజరు కావాల్సి ఉంది. ఆధార్ కార్డులు విస్తృత వినియోగం, అంతర్గత భద్రత, ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు... తదితర కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.