: టర్కీలో సైన్యం బీభత్స కాండ!... వైమానిక దాడుల్లో 48 మంది దుర్మరణం!


టర్కీలో ప్రజా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం... వైమానిక దాడులతో బీభత్స కాండ సృష్టించింది. ప్రజా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన టర్కీ సైన్యం, నానాటికీ పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో తిరుగుబాటు చేయక తప్పలేదని ప్రకటించింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి పాలనా పగ్గాలను చేజిక్కించుకోవడంతో సరిపెట్టుకోని సైన్యం రాజధాని అంకారాలోని పలు ప్రాంతాలతో పాటు పార్లమెంటు భవనంపైనా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 48 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పోలీసులు కూడా ఉన్నారు. శత్రు దేశాల నుంచి రక్షించాల్సిన సైన్యమే వైమానిక దాడులకు దిగడంతో టర్కీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

  • Loading...

More Telugu News