: నీస్ ఉగ్రదాడిపై స్పందించిన రాంగోపాల్ వర్మ!... ‘అటాక్ ఈజ్ నాట్ నైస్’ అంటూ ట్వీట్!
ఫ్రాన్స్ నగరం నీస్ పై నిన్న జరిగిన భీకర ఉగ్రదాడిపై బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. ఈ మేరకు నిన్న తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యక్షమైన వర్మ... దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన తీరుపై కూడా ఆయన వినూత్నంగా స్పందించారు. ‘అటాక్ ఆన్ నీస్ ఈజ్ నాట్ నైస్’ అంటూ ట్వీట్ చేశారు. దాడులు చేయడానికి ఉగ్రవాదులకు బాంబులు అవసరం లేదని, సాధారణ వాహనాలు చాలని ఈ దాడి నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.