: తల్లిదండ్రుల వద్దకు చేరిన బెజవాడ శిశువు!... అవనిగడ్డలో కిడ్నాపర్లు అరెస్ట్!


రెండు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్ నుంచి కిడ్నాప్ నకు గురైన ఐదు రోజుల శిశువు ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఈ ఘటనపై రెండు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. అసలు కిడ్నాపర్లను పట్టుకోలేని పోలీసులు తమ వీడియో ఫుటేజీలను ఎలా విడుదల చేస్తారంటూ ఓ మహిళ ఖాకీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎట్టకేలకు పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లను పట్టేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వ్యక్తులే శిశువును అపహరించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువును సుక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు.

  • Loading...

More Telugu News