: 'గూగుల్ సెర్చ్'లో సల్మాన్, సన్నీలియోన్ టాప్!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, శృంగార తార సన్నీ లియోన్ లకు అభిమానుల్లో అంతులేని ఆదరణ ఉందని గూగుల్ ప్రకటించింది. గత పదేళ్లలో భారతీయులు గూగుల్ లో నటులు, నటీమణులు, సింగర్, డ్యాన్సర్, డైరక్టర్, సెలబ్రిటీలు ఇలా వివిధ విభాగాల్లో ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే దానిని మీడియా సమావేశం పెట్టి మరీ గూగుల్ ప్రకటించింది. గత పదేళ్లలో సన్నీ లియోన్ హాట్ వీడియోల కోసం నెటిజన్లు తెగవెతికారని తెలిపింది. ఆ తరువాతి స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడని తెలిపింది. హాట్ వీడియోలను తప్పిస్తే సల్మాన్ ఖానే బాలీవుడ్ రారాజని, అతని గురించే ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారని తెలిపింది. సల్మాన్ తరువాత, షారుక్ రెండో స్థానంలో, అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలవగా, అలనాటి హీరోల గురించి చేసిన సెర్చ్ లలో నెంబర్ వన్ గా నిలిచిన బిగ్ బీ అమితాబ్, నటుల సెర్చ్ లో మాత్రం నాలుగో స్థానంలో నిలిచారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సన్నీ లియోన్ తరువాతి స్థానంలో కత్రినా కైఫ్ (సల్మాన్, రణ్ బీర్ లతో బ్రేకప్ విషయంలో), కరీనా కపూర్ (షాహిద్ బ్రేకప్, సైఫ్ తో పెళ్లి), దీపికా పదుకునే, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, తమన్నా బాటియా, అలియా భట్ లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే గూగుల్ సెర్చ్ లో నెటిజన్లు 'పీకే', 'బాహుబలి' కోసం ఎక్కువ మంది వెతికారని గూగుల్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News