: 'స్వచ్ఛభారత్'కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్
అమితాబ్ బచ్చన్ పై కేంద్ర ప్రభుత్వం మరోసారి నమ్మకం ఉంచింది. అవినీతికి పాల్పడ్డారంటూ అమితాబ్ పై 'పనామా పేపర్స్'లో ఆరోపణలు వెల్లువెత్తడంతో స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయినా సరే, వాటిని పట్టించుకోని కేంద్రం మరో పథకానికి ఆయనను ప్రచారకర్తగా నియమించింది. 'బేటీ బచావో బేటీ పడావ్' పథకానికి ప్రస్తుతం అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ కు కేంద్రం 'స్వచ్ఛభారత్' బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలను కూడా కట్టబెట్టింది. స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగంగా 'వేస్ట్ టు కంపోస్ట్' క్యాంపెయిన్ కు రాయబారిగా అమితాబ్ ను కేంద్రం నియమించింది. దీంతో వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ పథకానికి అమితాబ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.