: హరితహారం రికార్డుల కోసం కాదు...భవిష్యత్ తరాల కోసం: గవర్నర్
హరితహారం రికార్డుల కోసం సృష్టించిన కార్యక్రమం కాదని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారం భవిష్యత్ తరాల బాగుకోసమని చెప్పారు. చెట్లు నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాలుష్య నియంత్రణతో పాటు వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు నాటాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. చెట్లను భారత సంస్కృతిలో దేవుడిగా కొలుస్తారని ఆయన పేర్కొన్నారు. దేవుడిగా కొలిచే చెట్లను నరకడం సరికాదని ఆయన సూచించారు. వీటి వల్ల అన్ని వర్గాలకి ప్రయోజనం ఉంటుందని, హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.