: నా వంతు బాధ్యత నేను నిర్వర్తించా.. మరి మీరు?: హీరో నితిన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి సినీనటుల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగు సినీ నటులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రజలందరూ పాల్గొనాలని సూచిస్తున్నారు. హరితహారంలో పాల్గొన్న సినీనటుల జాబితాలో తాజాగా హీరో నితిన్ కూడా చేరిపోయారు. తాను హరితహారంలో పాల్గొన్నట్లు నితిన్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. తన కార్యాలయంలో మొక్కలు నాటుతుండగా తీసిన పలు ఫోటోలను నితిన్ పోస్ట్ చేశారు. హరితహారంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మీరు నిర్వర్తించారా? అని తన అభిమానులను నితిన్ ప్రశ్నించారు. పర్యావరణాన్ని పచ్చగా ఉంచుదామనే సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు.