: ముగిసిన టీవీ నటి శ్రీవాణి వివాదం... పోలీసుల సమక్షంలో సెటిల్ మెంట్!
టీవీ నటి శ్రీవాణి వివాదం ముగిసింది. రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో తన ఇంటిని కూల్చేశారంటూ శ్రీవాణి వదిన అనూష పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పరిగి గ్రామస్థులంతా అనూష వెంట నిలవడంతో శ్రీవాణి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు సహకరించకుండా షూటింగ్ అంటూ శ్రీవాణి తప్పించుకోవడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన శ్రీవాణి కుటుంబ సభ్యులు పరిగి పోలీస్ స్టేషన్ కు హాజరై వివాదాన్ని పరిష్కరించుకున్నారు. తన అన్న వైద్యానికి అప్పు చేసిన 40 లక్షల రూపాయలు చెల్లిస్తామని అంగీకరించారు. అలాగే అనూషకు ఓ ఫ్లాట్ ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇరు వర్గాలు అంగీకరించాయని వారు వెల్లడించారు.