: జమ్మూకాశ్మీర్ లో కుల్గాం పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి


జమ్మూకాశ్మీర్ లో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో చెలరేగిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దక్షిణ కాశ్మీర్ లో ఆందోళనలు ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. పోలీసు స్టేషన్లపై దాడులే లక్ష్యంగా, స్టేషన్లలో ఉన్న ఆయుధాల అపహరణకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కుల్గాంలోని ఓ పోలీస్ స్టేషన్ పై గ్రనేడ్ దాడికి దిగిన ఉగ్రవాదులు అనంతరం పోలీస్ స్టేషన్ పై తుపాకీ గుళ్లవర్షం కురిపించారు. పోలీసులు ఎదురు తిరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే గ్రనేడ్ దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడగా, పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News