: హాస్టల్ లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ... ఏయూలో సైన్స్ విద్యార్థుల ఆందోళన


ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్దదైన ప్రతిష్ఠాత్మక ఆంధ్రాయూనివర్సిటీ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే విద్యార్థులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి నాసిరకం భోజనం పెడుతున్నారని, ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్ పేరిట హాస్టల్ వార్డెన్స్ బెదిరింపులకు దిగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో సైన్స్ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులంతా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. చీఫ్ వార్డెన్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, తరగతులు బహిష్కరించి పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News