: శిశువు కోసం ఆరు బృందాలు గాలిస్తున్నాయి: మంత్రి కామినేని
విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తీసుకొచ్చిన ఓ శిశువుని నిన్న గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ శిశువు ఆచూకిని తెలుసుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈరోజు తెలిపారు. శిశువుని అపహరించిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఆయన చెప్పారు. శిశువు అపహరణలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు కామినేని పేర్కొన్నారు. తల్లి, శిశువుకు ప్రత్యేక ట్యాగులిస్తామని, ఇతరులు శిశువుని తీసుకెళితే అలారం మోగుతుందని ఆయన పేర్కొన్నారు.