: నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్షలు
ఇటీవల భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కేసులో విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా వారి కుమార్తె సానియాకు ఈరోజు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి సానియా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంటోన్న సంగతి తెలిసిందే. ఆమెను అక్కడి నుంచి డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్కి తీసుకొచ్చారు. సానియా నుంచి రక్తనమూనాలను సేకరిస్తున్నారు. రూపేశ్ తగలబెట్టగా కాలిపోయిన మృతదేహం సింథియాదేనని నిర్ధారణ చేయడం కోసం సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు రూపేశ్కు కోర్టు విధించిన మూడు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది.