: ఐఎస్ పై ఇక యుద్ధమే!... నీస్ ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన ట్రంప్!


ఫ్రాన్స్ నగరం నీస్ పై నిన్న రాత్రి జరిగిన భీకర ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. దాడిపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన ‘ఫాక్స్ న్యూస్’ ఛానెల్ తో మాట్లాడుతూ... ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై ఇక యుద్ధమేనని ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడినైతే ఐఎస్ పై యుద్ధం ప్రకటించాలని కాంగ్రెస్ ను కోరతానని తెలిపారు. ఐఎస్ ను ఆయన కేన్సర్ మహమ్మారిగా అభివర్ణించారు. ఐఎస్ పైకి నాటో దళాలను పంపించి అణచివేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News