: హెచ్ సీఏకు షాకిచ్చిన హనుమ విహారి!... ఏసీఏతో ఒప్పందం కుదుర్చుకున్న వైనం!
హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు హైదరాబాదు క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారి షాకిచ్చాడు. హైదరాబాదు జట్టు కెప్టెన్ గా ఉన్న విహారి... హెచ్ సీఏకు చెప్పా పెట్టకుండా ఏపీకి చెందిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు విహారే కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఏసీఏతో ఒప్పందం చేసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. ఈ నెల 22 నుంచే ఆంధ్రా జట్టుకు ఆడనున్నట్లు అతడు ప్రకటించాడు. ఈ విషయంలో తనకు హెచ్ సీఏ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాలేదని కూడా అతడు వ్యాఖ్యానించాడు.