: సంబరాలు మొదలు పెట్టిన ఐఎస్ఐఎస్... తదుపరి లక్ష్యం ఈఫిల్ టవరట!


ఫ్రాన్స్ లోని నీస్ లో ట్రక్కు నిండా పేలుడు పదార్థాలతో ప్రజలపైకి దూసుకొచ్చి 89 మంది అమాయకుల మరణానికి తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. 'బాస్టిల్ డే' పవిత్రయుద్ధం విజయవంతమైందని ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదులు అభినందనలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ తదుపరి లక్ష్యం పారిస్ లోని ఈఫిల్ టవర్ అని తెలుపుతూ ఐఎస్ఐఎస్ ఓ పోస్టరును విడుదల చేసింది. దీనిలో ఈఫిల్ టవర్, నిప్పుతో కణకణమండుతున్న ఓ అరచేతిని ఉంచింది. తమపై అగ్రరాజ్యాలు సైనిక చర్యలకు దిగుతున్నాయని, ఆ దేశాలన్నింటిపైనా ఆకస్మిక దాడులు చేయడమే తమ కర్తవ్యమని చెప్పుకున్నారు.

  • Loading...

More Telugu News