: ఎల్ఎల్బీ విద్యార్థిగా మారిన స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా
తన 22 ఏళ్ల సర్వీసులో 46 సార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా పంజాబ్ యూనివర్శిటీలో న్యాయవాద విద్యార్థిగా మారనున్నారు. రాబర్ట్ వాద్రా కేసు విషయంలో కీలక అధికారిగా పనిచేసి, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా విచారణను ముందుకు తీసుకెళ్లారన్న పేరును ఆయన తెచ్చుకున్నారు. తన మనసులో న్యాయవాద వృత్తిని చేపట్టాలని చిరకాలంగా ఉన్న కోరికను తీర్చుకునేందుకు సంకల్పించిన ఆయన, గత నెల 19న 2016-17 విద్యాసంవత్సరంలో లా కాలేజీలో ప్రవేశం కోరుతూ పరీక్షలు రాశారు. పంజాబ్ యూనివర్శిటీ నిర్వహించిన పరీక్షల్లో ఖేమ్కాకు టాప్ మార్కులు వచ్చాయి. 166.37 మార్కులతో ఆయన ఎల్.ఎల్.బి. కోర్సులో సీటు తెచ్చుకున్నారు. మూడేళ్ల పాటు విద్యను అభ్యసించి, న్యాయవాదిగానూ ప్రాక్టీసు మొదలెడతానని, రిటైర్ మెంటు తరువాత తన వ్యాపకం అదేనని ఖేమ్కా తెలిపారు.