: "నా చివరి కోరిక ఇదే..." అంటూ షీలా దీక్షిత్ కోసం తొలి స్లోగన్ తయారు చేసిన ప్రశాంత్ కిశోర్


షీలా దీక్షిత్... మరో రెండేళ్లలో 80వ పడిలోకి అడుగుపెట్టనున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడామె వద్దకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థినిగా ఆమె పేరు ప్రకటితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్లాన్లు వేస్తున్న ప్రశాంత్ కిశోర్, షీలా వయసును దృష్టిలో ఉంచుకుని స్లోగన్లు తయారు చేస్తున్నారు. తొలి స్లోగన్ ఇప్పటికే సిద్ధమైంది. "మేరీ జీవన్ కా ఏక్ హీ సప్నా... ఉత్తర్ ప్రదేశ్ కో దిల్లీ జైసా బనానా" (ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా అభివృద్ధి చేయాలన్నదే నా జీవితంలోని చివరి కోరిక) అన్న స్లోగన్ తయారైంది. ఇది ప్రజల్లోకి వేగంగా చొచ్చుకుపోతుందని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక షీలా వయసుతో పోలిస్తే సగం కన్నా తక్కువ వయసులో (37) ఉన్న ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా షీలా పేరును యూపీ ప్రజల్లోకి శరవేగంగా తీసుకెళ్లేందుకు వ్యూహాలు వేస్తున్నారు. ఆమెను బ్రాహ్మణ సమాజానికి దగ్గర చేయాలన్నది ప్రశాంత్ తొలి ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News