: రాజస్థాన్ లో ర్యాగింగ్ కలకలం.. బాలికను బాత్రూంకు తీసుకెళ్లి దుస్తులు విప్పించిన విద్యార్థినులు
ర్యాగింగ్ పేరుతో విద్యార్థినితో దుస్తులు విప్పించిన ఘటన రాజస్థాన్లోని జోధ్ పూర్ లో చోటుచేసుకుంది. ర్యాగింగ్ జరిగిన స్కూలు యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో ఇటీవల ఓ విద్యార్థిని పదకొండో తరగతిలో చేరింది. ఈనెల 8వ తేదీన ఇతర విద్యార్థినులు ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పించినట్టు ఏసీపీ స్వాతి శ్రీరాం తెలిపారు. ర్యాగింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన స్కూలు యాజమాన్యంతోపాటు ర్యాగింగ్ చేసిన విద్యార్థినులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ కోసం అంతర్గత కమిటీని నియమించినట్టు స్కూల్ సెక్రటరీ తెలిపారు. ర్యాంగింగ్ కు పాల్పడిన విద్యార్థినులను సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు.