: విజయవాడలో శిశువు మాయం కేసులో పురోగతి


విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయం కేసులో పురోగతి కనిపించింది. ఆసుపత్రి నుంచి శిశువును ఎత్తుకెళ్లిన మహిళను పోలీసులు గుర్తించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో మరో వృద్ధురాలికి ఆ శిశువును ఇచ్చినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఆ శిశువును తీసుకున్న వృద్ధురాలు గుంటూరు బస్సు ఎక్కినట్లు ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. కాగా, ఆసుపత్రి నుంచి శిశువు మాయమైన సంఘటనపై రష్యా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. సిబ్బంది అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, తక్షణం చిన్నారి ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News