: ఉగ్రవాదులకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దు: ఏపీ డీజీపీ రాముడు


ఉగ్రవాదులకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దని, వాళ్లు దాన్ని అవకాశంగా మలచుకునే ప్రమాదముందని ఏపీ డీజీపీ రాముడు అభిప్రాయపడ్డారు. కర్నూల్ లో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న సీఐడీ రీజనల్ కార్యాలయానికి డీజీపీ శంకుస్థాపన చేశారు. అనంతరం రాముడు మాట్లాడుతూ, శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రంలో క్రైం రేట్ కంట్రోల్ లో ఉందని, గత సంవత్సరంలో కన్నా ఈ ఏడాది క్రైం రేట్ బాగా తగ్గిందని చెప్పారు. త్వరలో జరగనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని రాముడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News