: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: ఎమ్మెల్యే రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చిత్తూరు జిల్లా లోని సత్యవేడు సబ్ జైలులో ఉన్న తమ పార్టీ నేత కేజీ కుమార్ ను రోజా, ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు పరామర్శించారు. అనంతరం రోజా మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అవే పథకాలను చంద్రబాబు ప్రవేశపెడుతున్నారని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినవంటూ చెప్పుకుంటున్నారని రోజా ఆరోపించారు.