: డిసెంబర్ లో పెళ్లి చేసుకోవట్లేదు... ‘జనతా గ్యారేజ్’ నా చివరి సినిమా కాదు: సమంత
యువహీరో నాగ చైతన్యతో ప్రముఖ హీరోయిన్ సమంత పెళ్లి డిసెంబర్ లో అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ట్విట్టర్ వేదికగా సమంత తన అభిమానులతో ముచ్చటించింది. డిసెంబర్లో పెళ్లి చేసుకోవట్లేదని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ‘‘జనతా గ్యారేజ్’ మీరు నటించే చివరి సినిమానా ?’ అనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ, ‘ఆ వార్త రూమర్ అయితే బాగుంటుంది’ అని చెప్పింది. ఇంకా చాలాకాలం పాటు తాను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని మరో ప్రశ్నకు అందాల సమంత జవాబిచ్చింది.