: గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో మరపడవ బోల్తా


గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద కృష్ణానదిలో మరపడవ బోల్తా పడింది. అందులో పరిమితికి మించి గ్రామస్తులు ప్రయాణిస్తుండడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం వైపు వెళుతుండగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో ఈ సంఘటన జరిగింది. ఎంతమంది గల్లంతయ్యారన్న సమాచారం తెలియాల్సి ఉంది. రేపు ఏకాదశి సందర్భంగా పాలంకి స్వామి ఆలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News