: రమ్య మృతి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారు: చిన్నారి అమ్మమ్మ


రమ్య మృతి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారంటూ ఆ చిన్నారి అమ్మమ్మ విజయ ఆరోపించారు. నిందితుడు శ్రావెల్ తో పాటు మిగతా ఐదుగురిపై కూడా సెక్షన్ 106, 107 కింద కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పరారైన శ్రావెల్ తల్లిదండ్రులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె అన్నారు. బాధ్యతా రాహిత్యంగా పిల్లల్ని పెంచినందుకు గాను విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. యాక్సిడెంట్ చేసిన విద్యార్థులు చదువుతున్న కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర రేపు మధ్యాహ్నం మానవహారంగా ఏర్పడనున్నామని విజయ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News