: ఎయిడ్స్ పరీక్షలు చేయించుకున్న వేల్స్ యువరాజు హ్యారీ


వేల్స్ యువరాజు హ్యారీ ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని భావించిన యువరాజు లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్ కు వెళ్లి హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ తెలిపింది. ఈ మేరకు హెచ్ఐవీ పరీక్షల సందర్భంగా తీయించిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం చాలా సులువని చెప్పిన ప్రిన్స్ హ్యారీ, ప్రజల్లో హెచ్ఐవీ పరీక్షలపై అవగాహన పెంచేందుకు పరీక్షలు చేసుకున్నట్టు తెలిపారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News