: మీ అన్న ఐసీయూలో ఉన్నప్పుడు కూడా చూళ్లేదు... శవం దగ్గర గంట ఉండి వెళ్లిపోయావు: టీవీ నటి శ్రీవాణిపై వదిన ఆరోపణలు
ఈ రోజు మీడియా సాక్షిగా తమ కుటుంబం మొత్తం తన వెనుకే ఉన్నారని చెబుతున్న శ్రీవాణి, ఊరి వాళ్లు చెబుతున్నది అబద్ధాలని ఎలా అంటుందని శ్రీవాణి వదిన అనూష ప్రశ్నించింది. టీవీ లైవ్ లో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఐసీయూలో ఉన్నప్పుడు అతనిని చూసేందుకు ఏనాడూ శ్రీవాణి రాలేదని అన్నారు. తన భర్త (శ్రీవాణి అన్న) మరణించినప్పుడు చూసేందుకు వచ్చిన శ్రీవాణి శవం దగ్గర గంటసేపు ఉండి వెళ్లిపోయిందని ఆమె తెలిపారు. భర్తకు చెప్పకుండా తన ఇంటికి వచ్చిన శ్రీవాణిని తాను ఎలా ఆదరించానో ఆమెకే తెలుసని అనూష తెలిపారు. తన భర్తతో కలిసి శ్రీవాణి ఇంటికి వెళ్తే సూటిపోటి మాటలతో తనను వెళ్లగొట్టిందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, 'ఆ ఇల్లు మల్లికార్జున్ బావ (అక్క భర్త) కూల్చివేస్తే తన భర్త కూల్చేశారంటూ ఈ కేసులోకి తమను ఎందుకు లాగార'ని అడిగింది. ఆ ఊర్లో ఉన్నవాళ్లు చెప్పేదంతా అబద్ధమని చెప్పింది. 'మహిళా మండలిలో తిరుగుతావు కనుక అక్కడ సపోర్ట్ నీకుంటుంద'ని ఆమె ఆరోపించింది. 'నువ్వు నన్ను జుట్టు పట్టుకుని కొట్టినా నేనేమీ అనలేద'ని ఆమె గుర్తు చేసింది.