: కాశ్మీర్లో కొనసాగుతోన్న ఉద్రిక్త వాతావరణం.. ఇప్పటి వరకు 37 మంది మృతి
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత కారణంగా కాశ్మీర్లో పెద్ద ఎత్తున చెలరేగుతోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ లోయలో వరుసగా ఆరో రోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుర్హాన్ కాల్చివేతకు నిరసనగా కొందరు యువకులు ఈరోజు రోడ్లపైకి వచ్చి భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. ఆరు రోజులుగా రెచ్చిపోతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. ఆందోళనలు చెలరేగుతోన్న కాశ్మీర్ లోయలో భద్రతా బలగాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కడి దుకాణాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాలయాలు ఈరోజు కూడా తెరుచుకోలేదు.