: సొంత తల్లిని, చెల్లిని కూడా అనుమానిస్తున్న జగన్: ఆనం సంచలన వ్యాఖ్య
వైకాపా అధినేత వైఎస్ జగన్ కు 'పవర్ ఫోబియా' పట్టుకుందని, అధికారం చేపట్టాలన్న ఆతృత ఆయన్ను మరింతగా దిగజారుస్తోందని తెలుగుదేశం నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, తన తల్లిని, చెల్లిని తెలుగుదేశం పార్టీవారిగా అనుమానిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదని ఆరోపించారు. ఈ కారణంతోనే అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని, మరింత మంది తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 'క్విడ్ ప్రోకో' అన్న పదాన్ని జగన్ పూర్తిగా తన సొంతం చేసుకున్నాడని ఎద్దేవా చేసిన ఆనం, సీఎం తానేనన్న భావనలో వింతవింతగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆయన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చూపించి చికిత్స చేయించాలని సలహా ఇచ్చారు.