: అమ్మ గర్వపడింది.. నాకు మాత్రం ఆశ్చర్యమేసింది: హీరోయిన్ సమంత
దక్షిణాది అందాల హీరోయిన్ సమంత నటనలోనే కాదు, చదువులోనూ మంచి మార్కులే సాధించేది. ఆమెకు పదో తరగతి, పన్నెండో తరగతి, డిగ్రీ లో వచ్చిన మార్కులే ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులను, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి అందుకున్న బీకాం డిగ్రీ మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్లను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన తల్లితో కలిసి ఈ ప్రోగ్రెస్ రిపోర్టులను ఇటీవల బయటకు తీసి చూశానని, వాటిని చూసి అమ్మ గర్వపడిందని, తాను మాత్రం ఆశ్చర్యపోయానని ఆ ట్వీట్ లో పేర్కొంది. ఏకాగ్రత పెట్టి, కష్టపడితే విజయం సాధించలేనిది లేదన్న దానిని తాను మొదటి నుంచి నమ్మడమే కాదు, పాటిస్తున్నానని పేర్కొంది. డిగ్రీ డిస్టింక్షన్ లో పాసైన అనంతరం తన సినీ ప్రయాణం మొదలైందని తెలిపింది. కాగా, సమంత టెన్త్ క్లాసు హాఫ్ ఇయర్లీ మార్కుల జాబితాలోని రిమార్క్ లో ‘సమంత చాలా మంచి మార్కులు స్కోరు చేసింది. ఈ పాఠశాలకు ఆమె అస్సెట్’ అని రాసి ఉంది.