: చంపించింది దత్తపుత్రికే... తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ అల్లుడి హత్యకేసులో వెలువడిన తీర్పు


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీ రామచంద్రన్ అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. ఎంజీర్ పెంపుడు కుమార్తె భాను శ్రీధర్ సైతం దోషేనని తేల్చి ఆమె సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. 2008, జూన్ 4న ఎంజీఆర్ మరో దత్త పుత్రిక సుధ భర్త విజయన్ ను కారుతో యాక్సిడెంట్ చేసి, ఆపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసు సీబీసీఐడీకి బదిలీ కాగా, మొత్తం 70 మంది సాక్ష్యాలను కోర్టు నమోదు చేసింది. ఆస్తి తగాదాల కారణంగా హత్యకు కుట్ర జరిగిందని, కరుణ అనే కానిస్టేబుల్ సాయంతో సోదరి భర్తను భాను శ్రీధర్ చంపించిందని రుజువైంది. ఇందుకుగాను కరుణకు రూ. 4 లక్షలు ఇచ్చినట్టు తేలింది. ఇదే కేసులో భానుకు సాయపడ్డ ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికీ పరారీలోనే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News