: చంచల్ గూడ జైలుకు శ్రావెల్... బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ‘రమ్య మృతి’ నిందితుడు!


హైదరాబాదీ చిన్నారి బాలిక రమ్య మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావెల్ పోలీసు కస్టడీ నిన్నటితోనే ముగిసింది. కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు శ్రావెల్ ను విచారించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు శ్రావెల్ కు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో శ్రావెల్ ను పోలీసులు చంచల్ గూడ్ జైలుకు తరలించారు. ఇదలా ఉంటే... ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రావెల్ కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు అతడి తరఫున లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... దానిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News