: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు... కారణమిదే!


గడచిన వారం పదిరోజులుగా, మబ్బుపట్టిన వాతావరణంతో చల్లగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాదాపు వారం రోజుల పాటు భారీ వర్షాలకు కారణమైన రుతుపవనాలు, హిమాలయాల వైపునకు వెళ్లిపోతుండటమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పగటి పూట ఎండ వేడిమి మరింతగా పెరుగుతుందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం అధికమని తెలిపారు. తిరిగి రుతుపవనాలు ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చే వరకూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని, ఆ తరువాతే మరోసారి భారీ వర్షాలకు అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, నిన్న కోస్తాలో సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 3 డిగ్రీలు, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో 1 నుంచి 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.

  • Loading...

More Telugu News