: కృష్ణా పుష్కరాలకు 202 ప్రత్యేక రైళ్లు!... నేటి నుంచే రిజర్వేషన్లు!
కృష్ణా పుష్కరాల కోలాహలం నేటి నుంచి మొదలవుతోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా, తాజాగా రైల్వే శాఖ కూడా తన ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలు జరిగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలకు మొత్తం 202 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదనపు చార్జీలతో నడవనున్న ఈ రైళ్లలో ప్రయాణానికి సంబంధించి నేటి నుంచి రిజర్వేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రైల్వే శాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో ప్రధాన మార్గాల్లో నడిచే రైళ్ల సంఖ్య ఇలా ఉంది. సికింద్రాబాదు- కాకినాడ- సికింద్రాబాబు... 14 కాచిగూడ- కాకినాడ పోర్టు- కాచిగూడ... 4 తిరుపతి- కాకినాడ- తిరుపతి... 28 తిరుపతి- విశాఖ- తిరుపతి... 4 తిరుపతి- రాజమండ్రి- తిరుపతి... 10 విజయవాడ- ఒంగోలు- విజయవాడ... 12 గుంతకల్- విజయవాడ- గుంతకల్... 12 మణుగూరు- తెనాలి- మణుగూరు... 24 హైదరాబాదు- విజయవాడ- హైదరాబాదు... హైదరాబాదు- గుంటూరు- హైదరాబాదు... 24 సికింద్రాబాదు- గద్వాల- సికింద్రాబాదు... 24 హైదరాబాదు- గద్వాల- హైదరాబాదు... 4