: మెట్లపై కాలు జారి పడ్డ కమలహాసన్!... అపోలో ఆసుపత్రికి తరలింపు!


తమిళ చిత్ర సీమలోనే కాకుండా యావత్తు భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోలీవుడ్ ప్రముఖ హీరో కమలహాసన్ కొద్దిసేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో చేరారు. నేటి ఉదయం చెన్నైలోని తన కార్యాలయంలో మెట్లపై నడుస్తున్న క్రమంలో ఆయన కాలుజారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. వెనువెంటనే స్పందించిన ఆయన కార్యాలయ సిబ్బంది కమల్ ను హుటాహుటిన నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కమల్ కు వైద్య పరీక్షలు చేసిన అపోలో వైద్యులు ఆయన కాలికి అయిన గాయం ఏ పాటిదో పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News