: మద్యం మత్తులో పార్లమెంటుకు ఆప్ ఎంపీ!: పంజాబ్ మాజీ సీఎం ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ మద్యం మత్తులో పార్లమెంటుకు హాజరయ్యారా? అంటే, అవుననే అంటున్నాయి ఆయన వైరి వర్గాలు. ఇప్పటికే ఆప్ నుంచి బహిష్కరణ వేటు పడిన యోగేంద్ర యాదవ్ ఈ మేరకు గతంలో సంచలన ఆరోపణలు చేశారు. మద్యానికి బానిసగా మారిన మన్... చాలాసార్లు తాగిన మైకంలోనే లోక్ సభలో అడుగుపెట్టారని ఆరోపించారు. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించి పార్లమెంటుకు వెళుతున్న భగవత్ మన్ పంజాబ్ ప్రజల ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు.