: అమితాబ్ ను కలిశాను... కొత్త ఎనర్జీ పొందాను: ప్రకాశ్ రాజ్
భారతీయ సినీ పరిశ్రమ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కలిశానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. ముంబైలోని లెజెండ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశానని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందని ప్రకాశ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ చూపించిన ప్రేమాప్యాయతలకు పొంగిపోయానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఆయన నుంచి కొత్త ఎనర్జీ పొందానని, కొత్త కలలతో ఆనందంగా బయటకు వచ్చానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్ తో తీసుకున్న సెల్పీని ప్రకాశ్ రాజ్ ట్విట్ చేశారు.