: సానియా ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన షారూఖ్ ఖాన్
సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఆవిష్కరించాడు. హైదరాబాదులోని స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షారూఖ్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే మాటలు కాదని అన్నాడు. కుటుంబం కన్న కలను సాకారం చేయడం చాలా శ్రమతో కూడుకున్న అంశమని తెలిపాడు. సానియా మీర్జా ఆ పనిని అవలీలగా చేసిందని చెప్పాడు. సానియా మీర్జా వంటి క్రీడాకారిణి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని షారూఖ్ అన్నాడు. సానియా మీర్జా బయోపిక్ నిర్మిస్తే అది మరింతమందికి స్పూర్తి నిలిపే అవకాశం ఉందని షారూఖ్ అభిప్రాయపడ్డాడు.